కేసీఆర్ పై డోస్ పెంచిన రేవంత్ రెడ్డి

TG: ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకు ముదురుతోంది. బుధవారం కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గోదావరి జలాల విషయం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ను 100 కొరడా దెబ్బలు కొట్టాలంటూ వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య రాజకీయం వేడెక్కింది. కృష్ణా, గోదావరి జలాల జగడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపనుందని జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్