రేవంత్ రెడ్డి.. నిన్ను వదిలిపెట్టం: బండి సంజయ్

ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని BJP నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరూర్ నగర్ సభలో మంత్రి మాట్లాడుతూ.. 'రేవంత్ రెడ్డి నీకు సంక్రాంతి డెడ్ లైన్. ఆ లోపు హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీదే, లేదంటే రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తులం బంగారం, మహిళలకు రూ.2500, రూ.4వేల పెన్షన్, యువతకు స్కూటీలు ఏమయ్యాయ్?' అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్