TG: హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో జరిగిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ సీజన్-2' ఈవెంట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్-సల్మాన్ ఆత్మీయంగా పలకరించుకుని హగ్ చేసుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని ముచ్చటించుకున్నారు. బైకర్ల విన్యాసాలు చూస్తూ ఉత్సాహంగా గడిపారు. కాగా ఎల్లుండి నుంచి ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సల్మాన్ ఖాన్ హాజరు కానున్నారు.