గడ్డంపై రేవంత్ vs కేటీఆర్ మాటల యుద్ధం

TG: గడ్డంపై సీఎం రేవంత్, కేటీఆర్ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంత గడ్డం పెంచినా తనలా కాలేరంటూ KTR గడ్డంపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. దీనిపై కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ.. రేవంత్‌ లాంటి గౌరవం లేని జీవితం ఎవరికీ వద్దంటూ కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి పాలనపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. గడ్డం అంశంతో మొదలైన విమర్శలు ఇప్పుడు పాలన, వ్యక్తిగత ప్రతిష్ఠపై మాటల యుద్ధంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕