రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు: కేటీఆర్

హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డిపైనే అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంతే కారణమని మండిపడ్డారు. తనపై నమోదు చేసిన కేసులో అసలు అవినీతే లేదని చెప్పారు. 'ఏం చేసుకుంటావో చేసుకో.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ' అని అన్నారు.

సంబంధిత పోస్ట్