TG: నిజామాబాద్ పోలీస్ హెడ్క్వార్టర్స్లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) సతీశ్ శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. సతీశ్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సతీశ్ ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, గత నెల ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.