వరి నాట్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

వరి నారు తీసేటప్పుడు మొక్కలు లేతాకుపచ్చగా ఉంటేనే మూన త్వరగా తిరుగుతుంది. నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన వేస్తే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశముంటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్నిబట్టి ఖరీఫ్‌లో చ.మీ.కు 33 మూనలు ఉండేలా చూడాలి. ఆలస్యంగా ముదురు నారు వేసేటప్పుడు చ.మీ.కు 44 మూనలు తగ్గకుండా నాటుకోవాలి. దమ్ము చేసిన 2-10 రోజులలోపు నాట్లు వేయటం ముగించాలి.

సంబంధిత పోస్ట్