కౌమార బాలికలు, మహిళలకు రుతు పరిశుభ్రత హక్కు జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఇది అతి ముఖ్యమని, గౌరవంతో కూడిన ఆరోగ్య సేవలు దేశంలో దక్కాలని పేర్కొంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలు కట్టుబడి ఉండేలా సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి పాఠశాల కౌమార బాలికలకు బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్‌కిన్‌లను ఉచితంగా అందించాలని, 6 నుండి 12వ తరగతి వరకు యుక్తవయస్సులో ఉన్న బాలికల పాఠశాలలలో రుతు పరిశుభ్రత విధానం జాతీయ విధానంగా మారాలని ఆదేశించింది.