లక్నోతో మ్యాచులో KKR ప్లేయర్ రింకూ సింగ్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ పట్టారు. మార్క్రమ్ కొట్టిన బంతిని పరుగెత్తుకుంటూ వెళ్ళి బౌండరీ వద్ద అందుకున్నారు. అంతలోనే కంట్రోల్ తప్పి బౌండరీ లైన్ దాటుతుండగా బంతిని లోపలికి వేసి మళ్లీ వచ్చి అందుకున్నారు. రింకూ సూపర్ ఫీట్‌కు ప్లేయర్లతో పాటు ప్రేక్షకులూ ఆశ్చర్యపోయారు. అంతకుముందు మార్ష్ క్యాచ్‌ను పావెల్ కూడా అద్భుతంగా అందుకున్నారు.