TG: కలకలం.. పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కాల్పులు

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రీజం పబ్‌లో శనివారం కాల్పుల కలకలం రేపింది. పబ్‌కు వచ్చిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతడు పోలీసులపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి, ఓ బౌన్సర్‌కు గాయాలు అయ్యాయి. అయితే నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అని పోలీసులు గుర్తించారు. 2022లో విశాఖ సెంట్రల్ జైల్లో ఇతడు శిక్ష అనుభవించాడు. ఇతనిపై100కు పైగా చోరీ కేసులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్