మెక్సికో జైలులో అల్లర్లు.. 10 మంది మృతి

మెక్సికోలోని సినలోవా రాష్ట్రంలో గురువారం జైలులో జరిగిన అల్లర్లలో పది మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో తొమ్మిది మంది ఖైదీలు, ఒక సందర్శకుడు ఉన్నారు. హింసను అదుపు చేయడానికి నేషనల్ గార్డ్‌ను మోహరించిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. అల్లర్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సినలోవా మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది డ్రగ్ కార్టెల్‌కు నిలయం.

సంబంధిత పోస్ట్

✕
✕