రిషభ్ పంత్‌కు గాయం!

న్యూజిలాండ్‌తో ఆదివారం జరగనున్న తొలి వన్డేకు ముందు భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన నడుము పైభాగంలో బంతి తగిలినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. వెంటనే మైదానం వీడిన పంత్‌కు సపోర్ట్ టీమ్ చికిత్స అందించింది. గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గాయం తీవ్రంగా ఉంటే, వడోదరలో జరిగే తొలి వన్డేలో పంత్ ఆడే అవకాశంపై సందేహాలు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్