రిషబ్ పంత్‌కు గాయం

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతి వేలికి గాయమైంది. బుమ్రా వేసిన 34 ఓవర్‌ తొలి బంతిని ఆపే క్రమంలో వికెట్ కీపర్ పంత్ వేలికి గట్టిగా దెబ్బతగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. ఓవర్‌ ముగిసేవరకు ఇబ్బంది పడుతూ వికెట్‌కీపింగ్ చేసిన పంత్.. తర్వాత మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. 34 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోరు 95/2గా ఉంది.

సంబంధిత పోస్ట్