‘కాంతారా’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్నారు కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో దీనికి ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించి ఓ క్రేజ్ న్యూస్ వైరల్ అవుతోంది. విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల బయోపిక్‌లో రిషభ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మరాఠా యోధుడు ఛత్రపతి పాత్రలోనూ రిషభ్ కనిపించనున్నాడు. ‘జై హనుమాన్’ చిత్రంలోనూ నటిస్తున్నారు.