గుండెపోటు బారినపడితే పురుషుల కంటే స్త్రీలలోనే నష్టం ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది. జీవనశైలిలో మార్పులతో శారీరక శ్రమ తగ్గిపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఊబకాయం, తీవ్ర ఒత్తిడి తదితర కారణాల వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, హైకొలెస్ట్రాల్ వంటివి చిన్న వయసులోనే చుట్టుముడుతున్నాయి. 80 ఏళ్ల పురుషుడు గుండెపోటుకు చికిత్స పొందితే 5 నెలల ఆయుర్దాయాన్ని కోల్పోతుండగా, 50 ఏళ్ల మహిళ 11 ఏళ్ల జీవిత కాలాన్ని నష్టపోవాల్సి వస్తోంది.