శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను సకాలంలో నియంత్రించకపోతే మూత్రపిండాల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీయవచ్చని డాక్టర్ కిషన్ తెలిపారు. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడాన్ని హైపర్‌యూరికేమియా అంటారు. ఇది గౌట్ (కీళ్ల వాతం) కు కూడా కారణమవుతుంది. దీనిని నియంత్రించడానికి తగినన్ని నీళ్లు తాగడం, వ్యాయామం చేయడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, మద్యం, మాంసం, హై ప్రోటీన్ పాల పదార్థాలు తగ్గించడం, బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీలో రాళ్లు, వాపు, పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.