వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు కిడ్నీ రాళ్ల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీహైడ్రేషన్, అధిక సోడియం, చక్కెర కలిగిన పానీయాలు, తగినంత నీరు తాగకుండా వ్యాయామం చేయడం వంటివి కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణాలని నిపుణులు తెలిపారు. రోజుకు కనీసం 2.5-3 లీటర్ల నీరు తాగడం, ఉప్పు తగ్గించడం, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోసకాయ వంటివి తినడం ద్వారా కిడ్నీ రాళ్లను నివారించవచ్చని సూచిస్తున్నారు.