AP: అన్నమయ్య జిల్లా సరిహద్దులో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు మంచినీళ్లకోట వద్ద డివైడర్‌ను ఢీకొట్టి పక్కకు ఓరిగిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.