ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళ్తున్న SUV వాహనం అదుపు తప్పి జనతా ఇంటర్ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో వరుడు సూరజ్ (24), వరుడి వదిన ఆశా (26), ఆశా కుమార్తె ఐశ్వర్య (2), విష్ణు (6), వరుడి అత్త, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.