అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్థిని ప్రసన్న అట్లూరి, జూలై 5న న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పేస్ యూనివర్సిటీలో విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.