క‌ట‌క్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు అథ్లెట్లు మృతి

ఒడిశాలోని కటక్ హైవేపై బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యం దొండపాటి, మలయ్ బారిక్ అనే ఇద్దరు యువ అథ్లెట్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో వారు బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృత్యం దొండపాటి అండర్-23 స్ప్రింటింగ్‌లో మంచి గుర్తింపు పొందగా, మలయ్ 400 మీటర్ల స్ప్రింట్‌లో ప్రతిభ కనబరిచారు.

సంబంధిత పోస్ట్

✕
✕