ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన చిట్టూరి భార్గవ్, పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్ ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లారు. వీరు శుక్రవారం స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్, సురేష్ చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.