TG: కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని శంకరపట్నం మండలం అంబాలపూర్ క్రాస్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.