కారుని ఢీకొట్టి ఈడ్చుకెళ్ళిన ట్రక్కు.. ప్రమాదం నుంచి బయటపడ్డ తండ్రి, కూతురు

ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో పలాసునీ బ్రిడ్జ్‌పై శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రీకూతుళ్లు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొని, సుమారు 600 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తూ, తండ్రీకూతుళ్లు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యాన్ని ఖండించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్