సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

సూర్యాపేట మండలం బాలెంల స్టేజి వద్ద వాకింగ్ చేస్తున్న ముగ్గురిని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో గుర్రం సైదులు అక్కడికక్కడే మృతి చెందగా, నాగరాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడిన గొల్ల జానయ్యను సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం అనంతరం ఆగకుండా వెళ్లిపోయిన బొలెరో వాహనం డ్రైవర్‌ను మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕