ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రిషికేశ్-బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి సుమారు 100 మీటర్ల దిగువన నీటిలో పడిపోయింది. మంగళవారం గూలర్ బజార్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు. బస్సులో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.