కాల్చిన శనగలతో జీర్ణక్రియకు మేలు: నిపుణులు

సాయంత్రం పూట స్నాక్స్‌గా తినే కాల్చిన శనగలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండి శరీరానికి తక్షణ శక్తిని అందించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాల్షియం, భాస్వరం వంటి ఖనిజాలు ఎముకలను, పళ్లను బలంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారానికి బదులుగా వీటిని తీసుకోవడం శ్రేయస్కరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕