అర్థరాత్రి బార్‌లో దొంగల బీభత్సం.. రూ.4 లక్షల నగదు మాయం

TG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దర్బార్ బార్‌లో మంగళవారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బార్ మెయిన్ గేటు తాళం పగలగొట్టి లోపలికి చొరబడిన దొంగలు, బీరువా తాళాలు విరగ్గొట్టి సుమారు రూ.4 లక్షల నగదును అపహరించుకెళ్లారు. బార్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕