చైనాలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడి పెట్రోల్ బంకుల్లో రోబోటిక్ అటెండెంట్లు అందుబాటులోకి వచ్చారు. ఈ ఆటోమేటెడ్ గ్యాస్ స్టేషన్లలో మానవుల సహాయం లేకుండానే రోబోలు వాహనాలకు ఇంధనం నింపుతాయి. వాహనం స్టేషన్‌లోకి రాగానే రోబో దానిని గుర్తించి, ఫ్యూయెల్ క్యాప్‌ను స్కాన్ చేసి, రెండు నిమిషాల్లో క్యాప్ తెరిచి ఇంధనం నింపి తిరిగి మూసేస్తుంది. ఈ విధానం గణనీయమైన సౌలభ్యం కల్పిస్తోంది.