అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థకు ఊహించని దెబ్బ తగిలింది. ఈ సంస్థ పరీక్షించిన ఓ రాకెట్ లాంచ్ ప్యాడ్‌పైనే పేలిపోయింది. దాంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్‌లో గురువారం రాత్రి బ్లూ ఆరిజిన్ సంస్థ ‘న్యూ గ్లెన్’ రాకెట్‌కు సంబంధించిన పరీక్ష నిర్వహించగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంస్థ వెల్లడించింది.