ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పారు. అతి తక్కువ వన్డే ఇన్నింగ్స్‌లలో 11,000 పరుగులు పూర్తిచేసుకున్న రెండవ బ్యాటర్‌గా రోహిత్(261) రికార్డులకెక్కారు. ఈ ఖాతాలో రోహిత్ కంటే ముందు టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ(222) ఉన్నారు. సచిన్ టెండూల్కర్(276), రికీ పాంటింగ్(286), సౌరవ్ గంగూలీ(288) రోహిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.