సామ్ సంగ్ నుండి రోలబుల్ స్మార్ట్‌ఫోన్?

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అగ్రగామిగా ఉన్న సామ్ సంగ్, త్వరలో రోలబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ 10-ఇంచుల వరకు విస్తరించే భారీ డిస్‌ప్లేతో 16:9 యాస్పెక్ట్ రేషియోతో రానుంది. దీనిని Galaxy Z Slide పేరుతో 2028 తొలి అర్ధభాగంలో వాణిజ్యపరంగా విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం ఫోల్డబుల్ మార్కెట్‌లో సామ్ సంగ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 2023లో CESలో సామ్ సంగ్ రోలబుల్ డిస్‌ప్లే టెక్నాలజీని ప్రదర్శించింది. అయితే ఫోల్డబుల్ ఫోన్ పై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

సంబంధిత పోస్ట్