TG: డీజే సౌండ్‌కి ఓ ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్దఎత్తున డీజే సౌండ్ పెట్టి తెల్లవారుజాము వరకు డ్యాన్స్ చేశారు. ఆ శబ్దానికి పక్కనే ఉన్న ఇంటి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మహిళపై పెచ్చులు పడటంతో స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.