800 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశాకు చేరిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌

రాయల్ బెంగాల్ టైగర్ సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిశా రాష్ట్రానికి చేరింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ పులి ఛత్తీస్‌గఢ్‌ వైపు ఉన్న సుందర్‌ఘడ్‌ జిల్లా బనయి అడవుల నుంచి డిసెంబర్‌ లేదా జనవరి నెలలో ప్రయాణం ప్రారంభించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 4-5 సంవత్సరాల వయస్సు గల మగపులిగా గుర్తించారు. అడవులు, నదులు, గ్రామాల గుండా ఇంత దూరం ప్రయాణించడం అరుదైన ఘటనగా నిపుణులు పేర్కొంటున్నారు. దీనిని అటవీ అధికారులు “అద్భుత ఘట్టం”గా అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్