రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ తొలి ఎలక్ట్రిక్ బైక్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర ఇంకా ప్రకటించనప్పటికీ, బైక్ లుక్, బ్యాటరీ, రేంజ్ వంటి కీలక వివరాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ బైక్ 3.91 kWh బ్యాటరీతో 154 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 15.4 kW మోటార్ తో 3.7 సెకన్లలో 0-60 km/h వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం 115 km/h. ఇందులో రిమోట్ లాక్, జియో-ఫెన్సింగ్, కార్నరింగ్ ఏబీఎస్, 3-స్థాయి ట్రాక్షన్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 3.5-అంగుళాల టచ్‌స్క్రీన్, ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. దీని పనితీరు 125cc-150cc పెట్రోల్ బైక్‌తో సమానంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.