ఆర్‌ఆర్‌బీ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 పీఈటీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అర్హత సాధించిన 42,143 మంది అభ్యర్థులు నవంబర్ 13 నుంచి డిసెంబర్ 6 వరకు పీఈటీ పరీక్షలకు హాజరుకావాలి. ఈ-కాల్ లెటర్‌లను పరీక్ష తేదీలకు కనీసం 2 వారాల ముందుగా వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. 4,208 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఖాళీల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టింది. పీఈటీ, పీఎంటీ క్లియర్ చేసిన వారికి అదే రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది.