రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు.. పాలన గాలికి: జీవన్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రాష్ట్రంలో RR టాక్స్‌లు వసూలు చేసుకుంటూ పాలన గాలికి వదిలేశారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 'కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు కూడా 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. కేటీఆర్ జూలై నెలలో కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించి, తక్షణమే నీటిని ఎత్తిపోస్తే కరువును అధిగమించవచ్చని సలహా ఇచ్చాడు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఒక కాపర్ డ్యామ్ నిర్మాణం చేస్తే నీటి ప్రవాహాన్ని ఆపి నీటిని ఎత్తిపోసుకునే వాళ్లం. ఇంత కరువులో కూడా తెలంగాణ ప్రజలకు, రైతులకు నీళ్లు ఇచ్చేవాళ్లం' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕