గువాహటి వేదికగా ముంబై ఇండియన్స్ (MI)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన RR 150 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ తడబడింది. టాప్ ఆర్డర్ స్వల్ప పరుగులకే ఔటయ్యారు. 11 ఓవర్లలో 123/9 పరుగులకే MI పరిమితమైంది.