RRB GROUP D 22,195 పోస్టులు.. మార్చి 11 చివరి తేదీ

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2026 సంవత్సరానికి గాను సుమారు 22,195 గ్రూప్-డి (లెవల్-1) కొత్త ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని మార్చి 11 వరకు పొడిగించారు. ట్రాక్ మెయింటైనర్, పాయింట్స్‌మ్యాన్ వంటి వివిధ విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ITI పూర్తి చేసి ఉండాలి. నెలకు రూ. 18,000 ప్రాథమిక వేతనంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్