RRB జాబ్ క్యాలెండర్ రిలీజ్

2026లో భారీగా రైల్వే ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పరీక్షల క్యాలెండర్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) విడుదల చేసింది. ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్ రానుండగా, మార్చిలో టెక్నీషియన్, ఏప్రిల్‌లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. జులైలో పారామెడికల్, జేఈ పోస్టులు, ఆగస్టులో NTPC, సెప్టెంబరులో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీలు, అక్టోబర్‌లో గ్రూప్-D నియామకాలు చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు పెద్ద అవకాశంగా మారనుంది.

సంబంధిత పోస్ట్