RRB రైల్వే రాత పరీక్షల తేదీలు విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) పారామెడికల్ విభాగంలో ఖాళీల భర్తీకి నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) తేదీలను ఖరారు చేశాయి. 2026 అక్టోబరు 18న విడుదలైన ప్రకటన ప్రకారం, CEN 05/2026 నోటిఫికేషన్ కింద నవంబర్ 23, 25 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రం, ఇతర వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. పరీక్షకు 10 రోజుల ముందు నగర వివరాలు, 4 రోజుల ముందు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕