TG: జాతీయ రహదారుల భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో ఆర్‌ఆర్‌ఆర్, జాతీయ రహదారుల నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్ రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.