పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ సోదరుడు సాహిల్ గోయల్‌పై అశుతోష్ అనే న్యాయవాది రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సాహిల్ తనపై ఆరోపణలు చేశారని అశుతోష్ పేర్కొన్నారు. కేసు పేపర్లపై సియాతో అశుతోష్ మోసపూరితంగా సంతకాలు చేయించారని, ఆయన తమ లాయర్ కాదని సాహిల్ మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాను పరువు నష్టం దావా వేసినట్లు అశుతోష్ తెలిపారు.