యూనియన్ నారీ శక్తి స్కీమ్‌తో మహిళలకు రూ.10 లక్షల లోన్

వ్యాపారం చేయాలనుకునే మహిళలను ప్రోత్సహించేందుకు యూనియన్ బ్యాంక్ ఓ పథకాన్ని అమలు చేస్తోంది. యూనియన్ నారీ శక్తి STP పథకం ద్వారా వ్యాపారం చేసే మహిళలకు తక్కువ వడ్డీతో రూ.10 లక్షల వరకు లోన్లు మంజూరు చేస్తోంది. 21 నుంచి 65 ఏళ్లలోపు మహిళలు దీనికి అర్హులు. వ్యాపారంలో మెజారిటీ వాటా మహిళలకు ఉండాలి. తీసుకున్న లోన్ 5 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. దీని కోసం యూనియన్ బ్యాంకును సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్