బిహార్ ఎన్నికలకు ముందు 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' పథకం కింద 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేశారు. అయితే సాంకేతిక లోపం వల్ల దర్భంగా జిల్లాలోని అహియారి గ్రామంలో కొందరు పురుషుల ఖాతాల్లోకి కూడా డబ్బులు వెళ్లాయి. ఈ పొరపాటును గుర్తించిన అధికారులు, ఆ డబ్బును తిరిగి రాబట్టేందుకు పురుషులకు నోటీసులు జారీ చేసి ఆపసోపాలు పడుతున్నారు.