గుజరాత్‌లోని ఓ టీ దుకాణంలో పనిచేస్తున్న కార్మికుడికి భారీ షాక్ తగిలింది. అతనికి ఐటీ శాఖ రూ.115 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఆసిఫ్ మహమ్మద్ అనే వ్యక్తి గిర్ సోమనాథ్‌లోని ఓ హోటల్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. నెలకు రూ.10 వేల జీతం వస్తున్నట్లు ఆసిఫ్ తెలిపాడు. బ్యాంక్ ఖాతాలో రూ.475 నగదు ఉన్న తనకు రూ.115 కోట్లు చెల్లించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు రావడం చూసి షాక్ అయ్యానని పేర్కొన్నాడు.