వరదల్లో కొట్టుకుపోయిన రూ.12 కోట్ల బంగారం.. వీధుల్లో వెతుకులాట (వీడియో)

చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో జులై 25న భారీ వరదలతో ఓ నగల షాపు నుంచి సుమారు 20 కిలోల బంగారం, నగదు కొట్టుకుపోయాయి. వీటి విలువ 10 మిలియన్‌ యువాన్లు (దాదాపు రూ.12 కోట్లు) ఉంటుందని షాప్ యజమాని వెల్లడించారు. దీంతో ఆభరణాలను వెతికేందుకు వీధుల్లో స్థానికులు పోటీపడ్డారు. కొంత మంది స్వచ్ఛందంగా బంగారం వెనక్కి ఇచ్చారు. ఇప్పటివరకు కేజీ బంగారం మాత్రమే లభ్యమైంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్