మధ్యప్రదేశ్‌లో ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం.. పథకం వివరాలు ఇవే!

కేంద్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి రైతులకు ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేశాయి. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 12,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం రూ. 6,000, ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన కింద రాష్ట్రం రూ. 6,000 అందిస్తాయి. ఈ పథకం లబ్ధి పొందడానికి రైతులు ఈ-కేవైసీ, భూమి రికార్డుల ధృవీకరణ, ఆధార్ అనుసంధానం, క్రియాశీల బ్యాంకు ఖాతా వంటి నిబంధనలను పూర్తి చేయాలి. దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి సి.ఎస్.సి సెంటర్‌ను లేదా గ్రామ పట్వారీని సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్