క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రీయ ఆరోగ్య నిధి (RAN) పథకం ద్వారా అర్హులైన రోగులకు రూ. 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ఈ పథకం గురించి తెలిపారు.