నేపాల్‌కు రూ.15వేల కోట్లు సాయం: మోదీ

నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్‌కు భారత్ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం కోసం రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య విద్యా, సాంకేతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు నేపాల్లో ఐఐటీ (IIT) ఆఫ్ షోర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕